ఫార్మర్స్‌ కోటాకు సంబంధించిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్

byసూర్య | Fri, Oct 16, 2020, 03:46 PM

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపిసి స్ర్టీమ్‌ కోర్సుల్లో బి.టెక్‌ ( అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), బి.టెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ) ఫార్మర్స్‌ కోటాకు సంబంధించిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బి.టెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌) 18సీట్లు, బి.టెక్‌ (ఫుడ్‌టెక్నాలజీ) 18సీట్లను టీఎస్‌ఎంసెట్‌-2020 (ఎంపిసి స్ర్టీమ్‌) ర్యాంకుల ఆధారంగా రిజర్వేషన్‌లకు లోబడి సీట్లను భర్తీచేస్తారని విశ్వవిద్యాలయ రిజిష్ర్టార్‌ డా.సుధీర్‌కుమార్‌ తెలిపారు. ఫార్మర్స్‌ కోటా (రైతుకోటా)లో సీటు పొందేందుకు అభ్యర్థి కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో (ఫామ్‌-1) విద్యాభ్యాసం చేసి ఉండాలని, కనీసం ఒక ఎకరం భూమి (ఫామ్‌-2) తల్లి లేదా తండ్రి లేదా అభ్యర్ది పేరుమీద కలిగి ఉండాలని అన్నారు. పూర్తి వివరాలను యూనివర్శిటీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM