అత్యాచార బాధితురాలి మృతి ప‌ట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

byసూర్య | Fri, Oct 16, 2020, 02:38 PM

అత్యాచార యత్నంలో తీవ్రంగా గాయపడి ఆ తర్వాత దుండగుల పెట్రోల్ దాడిలో 70 శాతానికి పైగా కాలిపోయి హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్, రెయిన్ బో హాస్పిటల్ లో గత పది రోజులుగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించిన బాలిక నర్మమ్మ మృతిపట్ల రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణానికి కారకులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. కూతురు మరణంతో తీవ్ర శోకసంద్రంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఆదుకుంటుందని ధీమా ఇచ్చారు.
తమ బిడ్డను కచ్చితంగా కాపాడాలని, సత్వర చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాలని నర్మమ్మ తల్లిదండ్రులు వెంకటమ్మ, ఉప్పలయ్యల విజ్ణప్తి మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ బాలికను రెయిన్ బో హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య స్వయంగా వెళ్లి బాలికను ఉస్మానియా హాస్పిటల్ నుంచి రెయిన్ బో హాస్పిటల్ కు తరలించి గత వారం రోజులుగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందిస్తున్నారు.
దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడిన బాలిక వైద్యం అందించినప్పటికీ నిన్న రాత్రి మరణించడం అత్యంత బాధాకరమని, ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బాలిక కుటుంబానికి కావల్సిన సాయాన్ని ప్రభుత్వం అందించేలా చర్యలు తీసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ను ఆదేశించారు. ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM