తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్యం విషమం

byసూర్య | Fri, Oct 16, 2020, 11:58 AM

మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ  సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. జూబ్లీహిల్స్ అపోలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో అడ్వాన్స్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు ఆరా తీస్తున్నారు.  


సెప్టెంబర్ 28న ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన సిటీ న్యూరో కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారం క్రితం పరీక్షలు చేయగా నెగటీవ్ వచ్చింది. త్వరలోనే డిశ్చార్జ్  అవ్వాల్సి ఉన్నా న్యుమోనియా కారణంగా అతడికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటనే జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇంకా సమయం గడిస్తే కానీ ఎలాంటి వివరాలు చెప్పలేమని వైద్యులు అంటున్నారు. కాగా ఇటీవల నాయినితో పాటు ఆయన భార్య భార్య అహల్య, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కొడుకు కరోనా బారిన పడగా వారంతా కోలుకున్నారు. కానీ నర్సింహారెడ్డి మాత్రం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM