గండిపేటలో పెరిగిన నీటి మట్టం

byసూర్య | Thu, Oct 15, 2020, 01:55 PM

హిమాయత్‌ సాగర్‌ తొమ్మిది గేట్లు మూసివేయడంతో దిగువకు వరద తగ్గింది. మరోవైపు ఎగువనుంచి వస్తున్న నీటితో గండిపేటకు నీటి ప్రవాహం పెరుగుతోంది.హిమాయత్‌ సాగర్‌కు పై నుంచి వచ్చే వరద తగ్గడంతో తెరిచిన  చేసిన 13 గేట్లలో 9 గేట్లు మూసివేశారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతం నుంచి నాలుగు గేట్లను మాత్రమే తెరచి ఉంచి నీటిని కిందికి వదులుతున్నారు. పై నుంచి వచ్చే వరద ఏమాత్రం పెరిగినా మళ్ళీ తెరుస్తామని లేదంటే ఒక్కొక్కటి మూసివేస్తామని జలమండలి అధికారులు తెలిపారు. గండిపేటకు బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో నీటి మట్టం‌ 1782 అడుగులకు చేరుకుంది. మరో 9 అడుగులు నీరు వస్తే గండిపేట చెరువు గేటు కూడా తెరిచే అవకాశం ఉంది. గండిపేట పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు. ఈ చెరువులోకి వచ్చే వరద జలాలను నిరంతరం మండలి అధికారులు పరిశీలిస్తున్నారు. వ


 


Latest News
 

24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM
యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం Tue, Apr 23, 2024, 12:35 PM