మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమావేశం

byసూర్య | Thu, Oct 15, 2020, 11:26 AM

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చిస్తారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకొని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ బి, విద్యుత్ శాఖ మంత్రులు కె.టి. రామారావు,  ఎర్రబెల్లి దయాకర్ రావు,  వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు శ్రీనివాస్ యాదవ్,  మెహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, ఎస్ పిడిసిఎల్ సిఎండి శ్రీ రఘుమారెడ్డి, మున్సిపల్ వ్యవసాయ, ఆర్ అండ్ బి శాఖల ముఖ్య కార్యదర్శులు, జిహెచ్ ఎంసి కమీషనర్, హైదరాబాద్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు సమావేశానికి తీసుకురావాల్సిందిగా సీఎం ఆదేశించారు. భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితి, తీసుకుంటున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలు తదితర విషయాలపై సమావేశంలో సమీక్ష జరుపుతారు.


 


 


Latest News
 

సికింద్రాబాద్‌ బరి నుంచి దానం ఔట్.. బొంతు రామ్మోహన్ ఇన్..! కారణం ఇదేనా Fri, Mar 29, 2024, 07:38 PM
కడియంకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం.. బరిలోకి మళ్లీ తాటికొండ రాజయ్య Fri, Mar 29, 2024, 07:34 PM
నాన్న ఎలాంటి వాడో తెలుసు, బిడ్డ ఒత్తిడితోనే ఈ నిర్ణయం: కేకే కొడుకు విప్లవ్ కుమార్ Fri, Mar 29, 2024, 07:28 PM
బీఆర్ఎస్‌ పార్టీలో చెత్తంతా పోయింది, ఇక మిగిలింది వాళ్లే.. అసెంబ్లీ మాజీ స్పీకర్ Fri, Mar 29, 2024, 07:26 PM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనం.. దేశంలోనే తొలిసారిగా ఆ కేసు నమోదు Fri, Mar 29, 2024, 07:23 PM