హిమాయ‌త్‌సాగ‌ర్ నుంచి మూసీలోకి భారీగా నీరు

byసూర్య | Thu, Oct 15, 2020, 08:48 AM

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని జంట జ‌లాశాయాల‌కు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతున్న‌ది. ఎగువ‌న నుంచి భారీగా నీరు వ‌స్తుండ‌టంతో హిమాయ‌త్ సాగ‌ర్ జ‌లాశయం 4 గేట్లు ఎత్తి నీటిని విడుద‌ల చేస్తున్నారు. దీంతో మూసీ న‌దిలో వ‌ర‌ద ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న‌ది.  హిమాయ‌త్ సాగ‌ర్‌లోకి 2,500 క్యూసెక్యుల నీరు వ‌స్తుండ‌గా, 2,744 క్యూసెక్యుల నీటిని అధికారులు దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. సాగ‌ర్‌లో ప్ర‌స్త‌తం 1763 అడుగుల నీటిమ‌ట్టం ఉన్న‌ది. 


అదేవిధంగా ఉస్మాన్‌సాగ‌ర్ చెరువులోకి ఎగువ‌నుంచి నీరు వ‌స్తూనే ఉన్న‌ది. చెరువులోకి 555 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో ఉండ‌గా, అంతేమొత్తంలో నీటిని విడుద‌ల చేస్తున్నారు. జ‌లాశ‌యం పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 1790 అడుగులు కాగా, ప్ర‌స్తుత 1782 అడుగుల నీటిమ‌ట్టం ఉన్న‌ది.


Latest News
 

కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు Tue, Apr 16, 2024, 03:32 PM
స్పోర్ట్స్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ Tue, Apr 16, 2024, 02:48 PM
ఎండల నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 02:48 PM
మహాజన్ సంపర్క్ అభియాన్ Tue, Apr 16, 2024, 02:04 PM
ఎల్లమ్మ తల్లికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు Tue, Apr 16, 2024, 01:30 PM