స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

byసూర్య | Mon, Oct 12, 2020, 05:23 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు లాభపడింది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు హరించుకుపోయాయి. చివరకు సెన్సెక్స్ 84 పాయింట్ల లాభంతో 40,584కి చేరుకుంది. నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 11,931 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్, హెల్త్ కేర్, ఎఫ్ఎంసీ సూచీలు మినహా మిగిలినవన్నీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఇన్ఫోసిస్, ఐటీసీ, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, ఏసియన్ పెయింట్స్ తదతర సంస్థలు లాభపడగా... ఎయిర్ టెల్, గెయిల్, జేఎస్డ డబ్ల్యూ, టాటా మోటార్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM