ధరణి పోర్టల్‘పై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..

byసూర్య | Mon, Oct 12, 2020, 02:04 PM

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో "ధరణి పోర్టల్" ఈ దసరా పండుగకు సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు 129 సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ , మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ గారితో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంతో కొన్ని దశాబ్దాల నుంచి ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడుతుందన్నారు. పూర్తి పారదర్శకతతో ధరణి పోర్టల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని, అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు ఆన్లైన్ చేసుకోవాలన్నారు. ధరణి పోర్టల్ తో ఇకమీదట రిజిస్ట్రేషన్లు ఆవెంటే మ్యుటేషన్ల ప్రక్రియకు వెసులుబాటు ఉందని ప్రతి ఒక్కరూ తమ ఆస్తులను ఆన్ లైన్ చేసుకోవాలన్నారు. ధరణి వెబ్ సైట్ లో వివరాల కోసం వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ధరణి పోర్టల్ పై ప్రజలకు ఎలాంటి అపోహలు వద్దని, ముఖ్యంగా ఎవ్వరూ దళారులను నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మధు మోహన్, నాయకులు చౌడ శ్రీనివాస్ రావు, నాగిల్ల శ్రీనివాస్, ఆమీర్ ఖాన్, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM