బతుకమ్మ చీరల పంపిణీ దేశానికి ఆదర్శం

byసూర్య | Mon, Oct 12, 2020, 12:57 PM

 తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టిన పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. ఆదివారం బెజ్జూర్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దగ్విజయంగా కొనసాగిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే గత నాలుగేండ్లుగా బతుకమ్మ పండుగ సందర్బంగా మహిళలకు కానుకగా బతుకమ్మ చీరలు పంపిణి చేయడం జరుగుతుందన్నారు. మహిళలు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవ సమయంలో అంబులెన్స్‌ సౌకర్యంతో పాటు కేసిఆర్‌ కిట్టును అందజేయడం , కూతురు జన్మించినట్లయితే రూ. 13వేలు, కుమారుడు జన్మించినట్లయితే రూ. 12వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా పెళ్లిళ్లు చేయలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆడ బిడ్డలకు పెళ్లి కానుకగా రూ. 1లక్ష116 కల్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ పథకం ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. 


అదే విధంగా వృద్ధ మహిళలకు, వితంతువులకు ఆసరా పథకం ద్వారా రూ. 2,016 , వికలాంగులకు రూ. 3,016 ప్రతీ నెల అందించడం జరుగుతుందన్నారు. పాపన్‌పేట గ్రామ పంచాయతీలో రైతుల పంట పొలాల్లో అటవీశాఖ అధికారులు హద్దుల పేరుతో జెండాలు పాతడం ఎంత వరకు సమంజసమని అటవీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు గత 50 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న రైతుల భూముల్లో అటవీశాఖ అధికారులు జెండాలు పాతడం ఎంత వరకు సమంజసమని అటవీ శాఖ అధికారుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని , ప్రజలు తిరగబడినట్లయితే పరిస్థితులు తారుమారవుతాయని హెచ్చరించారు. ఈ విషయంలో తాను రైతులకు ఎళ్లవేళలా అండగా ఉంటాననిరైతులకు భరోసా ఇచ్చారు. అదే విధంగా నియోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న రోడ్లు, వంతెనలు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తానని, రెండేళ్ల కాలంలో అన్ని గ్రామాలకు రోడ్లు, వంతెనలు మంజూరు చేయించి మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నిరు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM