ప్రారంభ‌మైన నిజామాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌

byసూర్య | Mon, Oct 12, 2020, 08:40 AM

హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. న‌గ‌రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జ‌రుగుతున్న‌ది. ఓట్ల‌లెక్కింపు కోసం ఆరు టేబుళ్లు ఏర్పాటుచేశారు. మొత్తం రెండు రౌండ్ల‌లో ఓట్లు లెక్కిస్తారు. మొదటి రౌండ్‌లో 600 ఓట్లు, రెండోరౌండ్‌లో మిగిలిన 221 ఓట్లను లెక్కించ‌నున్నారు. దీంతో ఉద‌యం 10.30 గంట‌ల వ‌ర‌కు ఫలితం వెలువ‌డ‌నుంది. లెక్కింపు కేంద్రానికి ఒక్కో పార్టీ నుంచి ఎనిమిది మందిని అనుమ‌తించారు.


ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్ 9న పోలింగ్ జరిగింది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండ‌గా, 823 మంది ప్ర‌జాప్ర‌తినిథులు త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ క‌విత‌, కాంగ్రెస్ నుంచి వ‌డ్డేప‌ల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్య‌ర్థిగా పోత‌న్‌క‌ర్ ల‌క్ష్మీనారాయణ పోటీచేశారు. 


Latest News
 

బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM
ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM