అధికారులకు, ప్రజలకు సూచనలు చేసిన కేసీఆర్...

byసూర్య | Sun, Oct 11, 2020, 05:38 PM

బంగాళాఖాతంలో వాయుగుండంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, ప్రజలకు సూచించారు.


"రాష్ట్రంలో ఇవాళ చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి కూడా భారీ, అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి" అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు.


జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, అధికారులంతా ఎక్కడివాళ్లు అక్కడే ఉండి పరిస్థితికి అనుగుణంగా సహాయ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో పాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.


Latest News
 

వడదెబ్బకు ఒకరి మృతి Fri, Apr 19, 2024, 01:14 PM
ఉదయ సముద్రానికి నీటి విడుదల నిలిపివేత Fri, Apr 19, 2024, 01:13 PM
డీజే వాహనం సీజ్ Fri, Apr 19, 2024, 01:11 PM
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:16 PM
హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM