తెలంగాణాలో భారీ వర్షం..

byసూర్య | Sun, Oct 11, 2020, 01:08 PM

హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. షేక్‌పేట, మణికొండ, గోల్కొండ, ఫిలిమ్‌నగర్, బంజరాహిల్స్, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, కొంపల్లి, దుండిగల్‌లో శేరి లింగంపల్లి, చందానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.  


పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మ్యాన్‌హోల్స్ ద్వారా నీటిని పంపేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. కాగా, రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లోనూ నిన్న రాత్రి నుంచి పలు చోట్ల  వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వరకు అత్యధికంగా దుబ్బాకలో 82 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. మహబూబాబాద్‌, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి,  నారాయణపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, కుమ్రంభీం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లిల్లోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.


కాగా, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్ర పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తం కొనసాగుతుందని వివరించింది. తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశ ముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM