ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు పొందడం మరింత ఈజీ

byసూర్య | Sat, Oct 10, 2020, 11:46 AM

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొంది. అటు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు.. ఇటు దుబ్బాక ఉప ఎన్నిక...తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇలా ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో ఎన్నికల కోసం పట్టభద్రులు ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఓటు హక్కు లేనివారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల అధికారులు. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు స్పష్టం తెలిపారు.
ఓటరు గుర్తింపు కార్డులో ఉన్న చిరునామాకు, దరఖాస్తు చేసుకుంటున్న ప్రాంతానికి తేడా ఉన్నప్పటికీ దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నదన్నారు. మాన్యువల్‌ గానే కాకుండాఆన్‌లైన్‌లో కూడా www ceote ranqana.nic.in వచ్చే నెల 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఐతే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు తెలంగాణ జనసమితి కూడా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.


Latest News
 

ఉపాధి పనులపై నిర్లక్ష్యం వద్దు: ఎంపీడీఓ Thu, Mar 28, 2024, 03:51 PM
వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ ను కలెక్టర్ పరిశీలన Thu, Mar 28, 2024, 03:46 PM
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి Thu, Mar 28, 2024, 03:44 PM
కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు Thu, Mar 28, 2024, 03:12 PM
పలు శుభకార్యాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం Thu, Mar 28, 2024, 03:11 PM