నిజామాబాద్ లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్...

byసూర్య | Fri, Oct 09, 2020, 05:59 PM

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 824 ఓట్లకు 824 ఓట్లు పోలయ్యాయి. కరోనా ఉన్న ప్రజాప్రతినిధులకు చివరి గంట ఓటు వేసే అవకాశం కల్పించారు. పీపీఈ కిట్లు ధరించి 24 మంది ప్రజాప్రతినిధులు ఓటేశారు. ఈ నెల 12న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కిస్తారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 


నిజామాబాద్‌లో 28, కామారెడ్డిలో 22 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడిజిల్లా పరిధిలో మొత్తం 824 ఓట్లు (నిజామాబాద్‌లో 483, కామారెడ్డిలో 341) ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌లోని జడ్పీ పోలింగ్‌ కేంద్రంలో అత్యధికంగా 67 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతన్ కర్ లక్ష్మీనారాయణ ఉన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వర్‌లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM