రాష్ర్టంలో మ‌త్స్య రంగానికి పెద్ద పీట : మంత్రి త‌ల‌సాని

byసూర్య | Fri, Oct 09, 2020, 01:51 PM

స‌ముద్ర ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల అభివృద్ధి సంస్థ ఉప ప్రాంతీయ‌ కార్యాల‌యాన్ని ప‌శుసంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య‌శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్రారంభించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని ప‌శు సంవ‌ర్ధ‌క డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో ఈ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు.


కార్యాల‌యం ప్రారంభం అనంత‌రం మంత్రి త‌ల‌సాని మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో మ‌త్స్య రంగానికి పెద్ద పీట వేశామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌త్స్య ప‌రిశ్ర‌మ‌పై 5 ల‌క్ష‌ల కుటుంబాలు ఆధార‌ప‌డి జీవిస్తున్నాయ‌ని తెలిపారు. ఈ ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెంద‌డం ద్వారా మ‌రో 6 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు. నీటి వ‌న‌రుల పెంపుతో రాష్ర్ట‌, దేశీయ ఎగుమ‌తుల‌కు అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. రొయ్య‌ల సాగు ప్రోత్సాహం కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని, మ‌త్స్య సంప‌ద ద్వారా రైతుల‌కు ల‌బ్ధి చేకూరాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఉద్ఘాటించారు. 


 


 


Latest News
 

మయూరి పార్కులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం Thu, Apr 18, 2024, 03:17 PM
ఉపాధి కూలీలా సమస్యలు తెలుసుకున్న నేతలు Thu, Apr 18, 2024, 03:16 PM
కోయిల్ సాగర్ లో 13 అడుగుల మేర నీరు Thu, Apr 18, 2024, 03:13 PM
అత్త, భార్య దాడి.. అల్లుడి ఫిర్యాదు Thu, Apr 18, 2024, 03:10 PM
ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 03:00 PM