ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నేటి నుండి ప్రారంభం...

byసూర్య | Fri, Oct 09, 2020, 01:00 PM

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 36 కేంద్రాల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులు ఒకేసారి రాకుండా స్లాట్‌ సమయాన్ని కుదించారు. నిరుడు 60 నిమిషాలపాటు ఉండగా.. ఈసారి 30 నిమిషాలు మాత్రమే కేటాయించారు. ర్యాంకుల వారీగా ప్రకటించిన విద్యార్థులనే కేంద్రంలోకి అనుమతిస్తామని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. తొలివిడత కౌన్సెలింగ్‌ 27న ముగియనుంది. చివరివిడత ప్రక్రియ ఈనెల 29 నుంచి నవంబరు 5 వరకు ఉంటుంది. ప్రైవేటు ఇంజనీరింగ్‌, బి-ఫార్మసీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లకు సంబంఽధించిన మార్గదర్శకాలను నవంబరు-4న విడుదల చేయనున్నారు. సాధారణంగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌  45-60 రోజుల పాటు సాగుతుంది. నిరుడు జూన్‌-24న మొదటి విడత  ప్రారంభమై జూలై-12వరకు కాగా, ఈసారి కరోనా నేపథ్యంలో ఎంసెట్‌ నిర్వహణ ఆలస్యం కావడంతో.. కౌన్సెలింగ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈసారి 28 రోజుల్లోనే మొదటి, చివరి విడత కౌన్సెలింగ్‌ పూర్తవనుంది.


మొదటి విడత కౌన్సెలింగ్‌...


ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీ చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ : అక్టోబరు 9-17


స్లాట్‌ బుక్‌ చేసినవారికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌  : అక్టోబరు 12-18


సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తర్వాత ఆప్షన్ల ఎంపిక : అక్టోబరు 12-20


ఫ్రీజింగ్‌ ఆఫ్‌ ఆప్షన్స్‌ : అక్టోబరు 20.. సీట్ల కేటాయింపు : అక్టోబరు 22


ట్యూషన్‌ ఫీ చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ : అక్టోబరు 22-27


 


చివరి విడత కౌన్సెలింగ్‌...


ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీ చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ : అక్టోబరు 29


స్లాట్‌ బుక్‌ చేసినవారికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌  : అక్టోబరు 30


ఆప్షన్ల ఎంపిక : అక్టోబరు 30-31.. ఫ్రీజింగ్‌ ఆఫ్‌ ఆప్షన్స్‌ : అక్టోబరు-31


సీట్ల కేటాయింపు : నవంబరు-2


ట్యూషన్‌ ఫీ చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ : నవంబరు 2-5


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM