ప్రెగ్నెన్సీ టైంలో కాఫీ, టీ తాగొచ్చా..?

byసూర్య | Thu, Oct 08, 2020, 05:04 PM

ప్రెగ్నెన్సీ ఏ మహిళకైనా చాలా కీలకమైన విషయం. అలాంటి సమయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ముఖ్యంగా ఏదిబడితే అది తినకూడదు. తాగకూడదు. బిడ్డ పెరుగుదలకు తోడ్పడే ఫుడ్‌ను తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆ సమయంలో కెఫిన్‌కి దూరంగా ఉండాలి. అంటే కాఫీ, టీలు తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా కెఫీన్ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌ని స్టిమ్యులేట్ చేసి షార్ఫ్‌గా చేస్తుంది. కొన్ని కెఫినేటెడ్ డ్రిన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల సెల్ డ్యామేజ్ జరగకుండా కాపాడతాయి. అయితే ఈ కెఫిన్‌ గర్భవతులకు మాత్రం మంచిది కాదు. గర్భవతుల్లో కెఫీన్‌ చాలా స్లోగా మెటబలైజ్ అవుతుంది. వారికి బాడీలో నుంచి కెఫిన్ ఎలిమినేట్ అవ్వడానికి మామూలు వారి కన్నా మూడు రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. కెఫీన్ ప్లెసెంటాని క్రాస్ చేసి బేబీ బ్లడ్ స్ట్రీమ్‌లోకి కూడా వెళ్తుంది.
గర్భవతులు కెఫీన్ తీసుకోవడం వల్ల అబార్షన్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. పుట్టిన పిల్లలు బరువు తక్కువగా పుట్టే అవకాశం ఉంది. అంతేకాక కెఫీన్ సైడ్ ఎఫెక్ట్స్‌లో హైబీపీ, రాపిడ్ హార్ట్ బీట్, యాంగ్జైటీ లెవెల్స్ పెరగడం, డిజ్జీనెస్, రెస్ట్‌లెస్‌గా అనిపించడం, కడుపులో నొప్పి, డయేరియా వంటివి కూడా ఉన్నాయి. వీటితోపాటు పిల్లలు బరువు తక్కువగా పుట్టడం, బిడ్డ చనిపోయి పుట్టడం, చైల్డ్ హుడ్ ఒబేసిటీ, చైల్డ్ హుడ్ అక్యూట్ ల్యుకేమియా వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కెఫీన్ కాఫీ, టీలో మాత్రమే కాదు. సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌లో కూడా ఉంటుంది. చాక్లెట్ మిల్క్, డార్క్ చాక్లెట్ మామూలు చాక్లెట్స్‌లో కూడా కెఫీన్ ఉంటుంది. డీకెఫినేటెడ్ కాఫీలో కూడా కొద్దిగా కెఫీన్ ఉంటుంది. కొన్ని పెయిన్ కిల్లర్స్, వెయిట్ లాస్ పిల్స్‌లో కూడా కెఫీన్ ఉండే ఛాన్స్ ఉంది.
ఏదిఏమైనా ప్రెగ్నెంట్ టైంలో కాఫీ, టీలు తీసుకోవడం తగ్గించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా పాలిచ్చే తల్లులు కూడా ఎంత వీలుంటే అంత తగ్గిస్తే మంచిది. కెఫీన్ వల్ల పాలు తగ్గిపోతాయనే ఒక నమ్మకం కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం బాలింతలు 300 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల బిడ్డకి మంచిది కాదని తెలుస్తోంది. వీలైనంత వరకూ కెఫీన్‌ని అవాయిడ్ చేయడమే మంచిది కావచ్చు.
మహిళలు రకరకాల సమస్యలను ఫేస్ చేస్తుంటారు. వారికొచ్చే ఆరోగ్య సమస్యలను పెద్దగా పట్టించుకోరు. కొంతమందికి అసలే అవగాహనే ఉండదు. అలాంటి వాళ్లకు తెలిసేలా ఈ సమాచారాన్ని షేర్ చేయండి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM