ఏప్రిల్ 30 వరకు ఎయిరిండియా విమానాలు బంద్

byసూర్య | Sat, Apr 04, 2020, 09:56 PM

కరోనా వైరస్ ప్రభావంతో భారత్ లో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే పరిస్థితుల బట్టి ఆ తర్వాత లాక్ డౌన్ కొనసాగించడమా లేదా అనే దాని పై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. అయితే విమానయాన సంస్థ ఎయిరిండియా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తన సర్వీసులను ఏప్రిల్ 30వ తేది వరకు నిలిపివేయనునట్టు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా నిలిపివేస్తూ ఎయిరిండియా నిర్ణయం తీసుకుంది. మరో వైపు స్పైస్ జెట్,ఇండిగో,గోఎయిర్ మాత్రం డొమెస్టిక్ విమాన సర్వీసులను ఏప్రిల్ 15 నుంచి నడిపేందుకు వీలుగా టికెట్ బుకింగ్స్ ప్రారంభించాయి. అయితే ఇవి కేవలం దేశీయానికి మాత్రమే పరిమితం చేసినట్టు సమాచారం. అంతర్జాతీయ సర్వీసులను మే 1 నుంచి నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మే 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన సంస్థల అధికార ప్రతినిధులు ప్రకటించారు. విస్తారా ఏప్రిల్ 15 నుంచి దేశీయ విమాన ప్రయాణాలకు మాత్రమే టికెట్ల బుకింగ్ చేస్తోంది. దాదాపు అన్ని విమాన సంస్థలు కూడా మే 1 నుంచే అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనున్నాయని తెలుస్తోంది.


Latest News
 

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం Fri, Mar 29, 2024, 11:44 AM
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు Fri, Mar 29, 2024, 11:44 AM
దారుణ... కాటేదాన్ లో మహిళ హత్య Fri, Mar 29, 2024, 11:42 AM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 11:41 AM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM