ప్రజలకు ఆన్ లైన్ లో ఉచిత వైద్య సేవలు

byసూర్య | Sat, Apr 04, 2020, 10:49 AM

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచిపోవడంతో ఫోరం ఫర్ పీపుల్స్ హెల్త్ సంస్థ ఆన్ లైన్ లో ఉచిత వైద్య సేవలకు శ్రీకారం చుట్టింది. అందుకోసం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారైనా హెల్ప్ లైన్ నెంబర్ 040 48214595కు ఫోనో చేస్తే సంబంధిత వైద్యులకు కనెక్ట్ చేస్తారు. తమకున్న సమస్యను వైద్యులకు చెబితే ఫోన్ లోనే మందులను సూచిస్తారు. అవసరమైతే మందుల చీటి రాసి వాట్సాప్ చేస్తారు. ఫోరం ఫర్ పీపుల్స్ హెల్త్ సంస్థ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా దాదాపు 140 మంది వివిధ స్పెషలిస్ట్ వైద్యులు సూచనలు అందిస్తారు. ఇది రేయింబవళ్లు అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా దీన్ని ఉపయోగించుకోవాలని సంస్థ తరపున ఆన్ లైన్ లో సేవలు అందిస్తున్న వైద్యుడు తెలిపారు. ఈ సేవలన్నీ ప్రజలకు ఉచితంగానే చేస్తున్నట్లు ఆయన వివరించారు. లాక్ డౌన్ వల్ల ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలకు ఇటువంటి సేవలు అందిస్తున్నట్లు ఫోరం తెలిపింది. కొందరు ఆస్పత్రులకు వెళ్లాలన్నా ఓపీ బంద్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆన్ లైన్ లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ హెల్ప్ లైన్ కు ఒక్క రోజులోనే 275 ఫోన్ కాల్స్ వచ్చాయి. వైద్యులు వారితో మాట్లాడి వారికి మందులు సూచించారు. కొందరికి వాట్సాప్ ద్వారా మందుల చీటిని పంపించారు. మారుమూల గ్రామం నుండి నగరాలు, పట్టణాల వరకు కూడా ప్రజలు ఫోన్లు చేస్తున్నారు.


Latest News
 

అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM
యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం Tue, Apr 23, 2024, 12:35 PM
డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి Tue, Apr 23, 2024, 12:33 PM