తెలంగాణలో 229 కేసులు..

byసూర్య | Sat, Apr 04, 2020, 10:44 AM

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఢిల్లీ జమాత్ సదస్సు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. కరోనా బాధితుల్లో జమాత్ సదస్సుకి వెళ్లిన వారే ఎక్కువమంది ఉన్నారు. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 164కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనాతో ఒకరు చనిపోయారు. కరోనా నుంచి కోలుకున్న మరో ఇద్దరిని నిన్న(ఏప్రిల్ 3,2020) డిశ్చార్జ్ చేశారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి నలుగురు కోలుకున్నారు.


ఇక తెలంగాణలోనూ కరోనా పంజా విసిరింది. తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 229కి పెరిగింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ జమాతే సదస్సు కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణమైందంటున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 11మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో నిన్న(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు 32మంది కోలుకున్నారు. ప్రస్తుతం 186మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో హోం క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారి సంఖ్య 19వేల 368


ఇక రాష్ట్రం నుంచి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య 1030గా అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 925మందిని అధికారులు గుర్తించారు. ఇంకా 105మందిని గుర్తించాల్సి ఉంది. రాష్ట్రం నుంచి మర్కజ్ వెళ్లి వచ్చినవారిలో 161మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న 400మంది అనుమానితుల నమూనాలకు పరీక్షలు చేశారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారితో సంబంధం ఉండి పరీక్షించాల్సిన నమూనాలు 600. రాష్ట్రంలో 22 జిల్లాలకు కరోనా వైరస్ విస్తరించింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో 435మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 365మంది ప్రభుత్వ క్వారంటైన్ లో ఉన్నారు.


Latest News
 

గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు Sat, Apr 20, 2024, 12:34 PM
ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ప్రచారం Sat, Apr 20, 2024, 12:32 PM
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి: సంక్షేమఅధికారి బావయ్య Sat, Apr 20, 2024, 12:30 PM
వైభవంగా పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం Sat, Apr 20, 2024, 12:29 PM
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక Sat, Apr 20, 2024, 12:26 PM