లాక్ డౌన్ ఉల్లంఘనలపై పోలీసుల యాక్షన్

byసూర్య | Sat, Apr 04, 2020, 09:31 AM

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి చెందుతోంది. దీంతో గత 10 రోజులుగా లాక్ డౌన్ అమలవుతోంది. అయితే లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. సామభేద దండోపాయలను ఉపయోగిస్తున్నారు. రోడ్లమీదకు రావద్దు మహా ప్రభో అని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల గుంజీలు తీయించడం, మరికొన్ని చోట్ల లాఠీలతో పనిచెప్పడం, వాహనాలు సీజ్ చేయడం చేస్తున్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్ల పైకి వచ్చిన వాహనదారులపై చర్యలకు దిగారు ట్రాఫిక్ పోలీసులు. మార్చ్ 23 వ తేదీ నుండి ఏప్రిల్ 3 వ తేదీ వరకు రోడ్లపైకి వచ్చిన టూవీలర్ వాహనాలు 1,34, 107. త్రీ వీలర్ వాహనాలు 3360. ఫోర్ వీలర్ వాహనాలు 7958. మొత్తం 146258 వాహనాలు సర్వైవలెన్స్ కెమెరాల ద్వారా గుర్తించి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందిరిపై వయోలేషన్ ఆక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. 


Latest News
 

సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత Fri, Mar 29, 2024, 08:37 PM
మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం Fri, Mar 29, 2024, 08:36 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Fri, Mar 29, 2024, 08:34 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Fri, Mar 29, 2024, 08:33 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:32 PM