తెలంగాణకు వర్ష సూచన

byసూర్య | Sat, Apr 04, 2020, 09:28 AM

వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటోది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటోంది. కోమోరిన్‌ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటు హైదరాబాద్‌తో పాటూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.


ఇటు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత రెండు రోజులు 38.2 డిగ్రీలు, కనిష్టంగా 24.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 58 శాతం నమోదైంది. మరో వారం రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 37– 38 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. కానీ తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ అంచనాతో వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM