స్మార్ట్‌ఫోన్ల ధరల పెంపు..నేటి నుంచి అమలు

byసూర్య | Thu, Apr 02, 2020, 12:25 PM

 మొబైల్‌ ఫోన్లు, పలు విడి భాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను   12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.  ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.  దీంతో పెరిగిన పన్ను భారంతో మొబైల్‌ ఫోన్ల ధరలు కూడా పెరిగాయి.చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను మార్చి11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. రియల్‌మి 6, రియల్‌మి ఎక్స్‌2, రియల్‌మి ఎక్స్‌టీ మోడళ్లపై ధరలు పెంచినట్లు రియల్‌మి సంస్థ బుధవారం ప్రకటించింది.  భారత ప్రభుత్వం మొబైల్‌ ఫోన్లపై జీఎస్టీని పెంచడంతో తమ కంపెనీ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంచినట్లు రియల్‌ మి పేర్కొంది. పెరిగిన రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. రియల్‌ మి కంపెనీకి చెందిన మూడు మోడళ్లపై కనీసం రూ.1000 పెరిగింది. 


కొత్త ధరలు ఇవే..


Realme 6 (4GB+64GB) మోడల్‌ ధర రూ. 13,999


 Realme X2 (4GB+64GB) మోడల్‌ ధర రూ.17,999


Realme XT (4GB+64GB) మోడల్‌ ధర రూ.16,999


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM