ప్రతిరోజూ ఆహారంలో పచ్చి బఠాణీలను తీసుకుంటే ?

byసూర్య | Wed, Apr 01, 2020, 03:24 PM

పచ్చి బఠానీలను వంటకాలలో అధికంగా వాడుతుంటాం. ఈ బఠానీలను తరచుగా కుర్మా, ఉప్మా, బిర్యానీ వంటి వంటకాలలో వాడుతుంటాం. ఈ పచ్చి బఠానీలలో పోషకాలు చాలా ఉన్నాయి. తరుచుగా వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుండి కాపాడటంలో ఈ పచ్చి బఠానీలు చక్కగా పనిచేస్తాయి. ప్రతిరోజూ వీటిని ఆకుకూరలలో, కూరగాయలలో కలిపి వంటకాలలో తరచుగా తీసుకుంటే విరేచనాలు సాఫీగా జరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పచ్చి బఠాణీలు చాలా ఉపయోగపడుతాయి. పచ్చి బఠాణీలలో విటమిన్ ఎ, బి1, బి2, సి, ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన బఠాణీలు పిల్లల ఎదుగుదలకు మంచిగా సహాయపడుతాయి.  ఈ పచ్చి బఠాణీలను ప్రతిరోజూ తీసుకుంటే పలు రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో చక్కగా పనిచేస్తాయి. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. ఈ పచ్చి బఠాణీలలో విటమిన్ కె అధిక మోతాదులో దొరుకుతుంది. బఠాణీలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటలో ఉపయోగపడుతాయి. అల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలను నియంత్రించుటకు ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Latest News
 

ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM
నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, Apr 18, 2024, 10:38 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 18, 2024, 10:24 AM
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి Thu, Apr 18, 2024, 10:23 AM
కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ Thu, Apr 18, 2024, 10:11 AM