నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు..

byసూర్య | Wed, Apr 01, 2020, 02:40 PM

దేశంలో ఇంధన ధరలు నిలకడగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పైకి కదిలాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.69.59 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.62.29 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.75.30 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.65.21 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి నిలకడగానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.74.61 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్దనే నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.21 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.68.15 వద్దనే నిలకడగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.39 శాతం పెరుగుదలతో 26.06 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.68 శాతం పెరుగుదలతో 20.62 డాలర్లకు ఎగసింది.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM