దినసరి కూలీలకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేసిన నిజాంపేట్ మేయర్

byసూర్య | Wed, Apr 01, 2020, 02:36 PM

ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 12 వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 మరియు ఫేస్-3 లలో నివాసం ఉంటున్న దినసరి కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భవన నిర్మాణ వలస కూలీలు గత కొన్ని రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కార్యక్రమంలో భాగంగా కూలీలకు ఎలాంటి పనులు లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారింది, దీంతో తిండిలేక అలమటిస్తున్నవారికి అండగా స్థానిక కార్పొరేషన్ మేయర్ గౌరవనీయులు శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి  వారి పరిస్థితిని గ్రహించి, ప్రతి ఒక్కరికీ 4 కేజీల బియ్యం, మరియు 1 కేజీ కందిపప్పు దాదాపుగా 1000 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ లో స్థానికంగా నివాసం ఉంటున్న దినసరి కూలీలు తో పాటు, అందరి బాధను అర్థం చేసుకొని స్థానికులకు కూడా మేయర్ గారు పంపిణీ చేయడం జరిగింది,కూలీల బాధలను మన నగరపాలక సంస్థ పాలకవర్గం మరియు NMC అధికారులు సహృదయంతో పరిష్కరించాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో గౌరవ కమిషనర్ శ్రీ గోపీ ఐఏఎస్ గారు , TRS పార్టీ సీనియర్ నాయకులు  కోలన్ గోపాల్ రెడ్డి  పాల్గొన్నారు.


 


 


 


Latest News
 

ఉపాధి పనులపై నిర్లక్ష్యం వద్దు: ఎంపీడీఓ Thu, Mar 28, 2024, 03:51 PM
వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ ను కలెక్టర్ పరిశీలన Thu, Mar 28, 2024, 03:46 PM
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి Thu, Mar 28, 2024, 03:44 PM
కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు Thu, Mar 28, 2024, 03:12 PM
పలు శుభకార్యాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం Thu, Mar 28, 2024, 03:11 PM