పెన్షనర్ల జీతాల్లో కోత విధించవద్దని సీఎంకి విజ్ఞాప్తి

byసూర్య | Wed, Apr 01, 2020, 02:00 PM

పెన్షనర్ల జీతాల్లో కోత విధించవద్దని మంగళవారం సీఎం కేసీఆర్ కి ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విజ్ఞాప్తి చేశారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యలో భాగంగా పెన్షనర్ల జీతాల్లో కోత విధించాలనుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 30, 40 ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి, ఈరోజు కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి జీవనం గడుపుతున్న వృద్ధులకు తీవ్రమైన మానసిక క్షోభ కలిగించడంతో పాటు కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. చాలా మంది రిటైర్డు ఉద్యోగులు ఒకవైపు సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో మగ్గుతూ.. మరోవైపు రోగాలతో నానా ఇబ్బందులకు గురవుతూ, వచ్చే పింఛన్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM