ఆవాలు ఆరోగ్యానికి ఎంతో మేలు...!

byసూర్య | Wed, Apr 01, 2020, 01:42 PM

ఆవాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవాలు రెండు రకాలున్నాయి.. నలుపు ఆవాలు, తెలుపు ఆవాలు. ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎప్పుడూ నల్ల ఆవాలు గురించే ఎందుకు.. తెలుపు ఆవాలు తీసుకుంటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.. ఈ ఆవాల్లో డైటరీ ఫాట్స్, కార్బొహైడ్రేట్స్, ఫాట్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి4, బి5, బి6, బి9, సి, ఇ, కె, జింక్, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటివి అధిక మోతాదులో ఉన్నాయి.


ఆరోగ్య ప్రయోజనాలు:
1. ఈ ఆవాలతో తయారుచేసిన నూనెను భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనెలో న్యూటియన్ ఫాక్ట్స్ ఎక్కువ. చేపలతో తయారుచేసి వంటకాల్లో ఈ ఆవాల పొడి చేర్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
2. ఆవాల పొడిని సలాడ్స్, సూప్స్ వంటి వాటిల్లో వాడుతారు. వీటిని తీసుకుంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ ఆవాలు ఎక్కువగా భారతీయ వంటకాల్లో వాడుతారు.
3. బెల్లంలో కొన్ని వేరుశెనగలు, ఆవాలు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆపై వాటిని ఉండల్లా చేసుకుని ఉడికించుకోవాలి. ఇలా చేసిన వాటిని రోజుకు ఒకటి తీసుకుంటే.. ఆస్తమా వ్యాధికి చెక్ పెట్టవచ్చును.
4. ఆవనూనెను తలకు పట్టిస్తే జుట్టు రాలకుండా ఉంటుంది. దాంతో చుండ్రు సమస్య కూడా పోతుంది. ఆవాల పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకోవాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచు చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.
5. 500 గ్రాముల ఆవాల పొడిలో కొద్దిగా నెయ్యి, స్పూన్ తేనె కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుపూటలా తీసుకుంటే ఆస్తమా, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు.
6. ఆవాల పొడిని కడుపు ప్రాంతంలో రాసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఎక్కువగా వాంతులు, నీళ్ల విరేచనాలవుతుంటే.. ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM