"లాక్ డౌన్" సమయంలో.. సహజీవనం పై సైకాలజిస్టులు...

byసూర్య | Wed, Apr 01, 2020, 01:21 PM

ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఆరేళ్ల కిందట టీనేజర్‌ని. అతను వెంటపడితే చంపేస్తానని బెదిరించాను. ఇప్పుడు నేనే తనను వెంట పడమంటుంటే... వద్దంటున్నాడు. నేను సైకాలజిస్టును కలవాలా?


కోల్‌కతాలో చదువుకుంటున్న అతను... మా ఇంట్లో పార్ట్ టైమ్ వర్క్ చేసేవాడు. అలా మామధ్య స్నేహం మొదలైంది. ఓ రోజు అమ్మానాన్నా ఇంట్లో లేరు. మేం కలిసి కాఫీ తాగాం. అప్పటి నుంచి మా మధ్య క్లోజ్ నెస్ పెరిగింది. ఇంట్లో అమ్మానాన్నా ఎప్పుడు బయటకు వెళ్లినా మేం బిజీ అయ్యేవాళ్లం. కలిసి కూల్ డ్రింక్ తాగేవాళ్లం. మా హార్ట్ బీట్ పెరిగేది.


ఈ విషయం నేను తప్పక చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదే నన్ను బాగా వేధిస్తోంది. ఓ రోజు మేం ఫిజికల్‌గా కలిశాం. అప్పటి నుంచీ కలుస్తూనే ఉన్నాం. నేను తనను పెళ్లి గిళ్లీ అంటూ తొందర పెట్టలేదు. తన దారిన తాను చదువుకుంటున్నాడు. మరోవైపు మా ఆనందక్షణాలు కొనసాగాయి. 


ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ మొదలయ్యాక... తను మా ఇంటికి రావట్లేదు. నాకు పిచ్చెక్కుతోంది. తనను చూడాలనీ, కలవాలనీ అనిపిస్తోంది. తను మాత్రం ఇది సరైన టైమ్ కాదంటున్నాడు. ఫోన్‌లో మాట్లాడుకుందాం అంటున్నాడు. అది నాకు నచ్చట్లేదు.


ఇలాంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. దీనిపై స్పందించిన సైకాలజిస్టులు... ఆమె తల్లిదండ్రులది తెలివైన నిర్ణయం అన్నారు. లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్‌తో పోరాటం అత్యంత ముఖ్యమైనది కాబట్టి... ఈ సమయంలో అతను ఇంటికి రాకపోవడమే మంచిదన్నారు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అయితే... అతనితో సరదాగా గడిపిన క్షణాలు గుర్తుచేసుకోవాలే తప్ప... అతన్ని ఇబ్బంది పెట్టడం కరెక్టు కాదంటున్నారు. ఇంట్లో ఉంటూ ఆమె... ఇతరత్రా కెరీర్ అంశాలు, సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం మేలంటున్నారు. 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM