సీఎం కేసీఆర్ కి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ

byసూర్య | Wed, Apr 01, 2020, 12:17 PM

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రతిపక్ష పార్టీగా మా వంతు సహకారం ఉంటుందన్నారు. రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నందువల్ల రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మేము రాజకీయ విమర్శలు చేయలేదు కానీ నేడు ఆర్థిక లోటు పేరుతో ప్రభుత్వ ఉద్యోగుల పొట్టమీద కొట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. లాక్ డౌన్ విధించే రోజు సీఎం కేసీఆర్ మనది ధనిక రాష్ట్రం 10వేల కోట్లు అయిన ఖర్చుపెడదాం అన్నారని, ఇప్పుడు ఆర్ధిక లోటు అంటూ జీతాలు కట్ చేస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. 8 రోజుల లాక్ డౌన్ కే రాష్ట్రంలో ఆర్థిక లోటు వచ్చిందా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రం ఎటు పోతుందో అన్న భయంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారన్నారు. కరోనా పై ప్రతి రోజు పోరాడుతున్న ఉద్యోగులకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రైవేట్ సంస్థలను జీతాలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మీరు చేస్తుందని ఏంటని తెలిపారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM