అన్నం తెల్లగా ఉండాలంటే... ?

byసూర్య | Wed, Apr 01, 2020, 11:44 AM

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ మనం చేసుకుని ఆహార పదార్థాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చును. అలానే వంటిట్లో తప్పకుండా కూరగాయలు, పండ్లు ఇంకా ఏవేవో ఉంటాయి. వాటిని తాజాగా ఉంచాలంటే.. ఏం చేయాలో చూద్దాం.
1. అన్నం వార్చినప్పుడు వచ్చిన గంజిలో విటమిన్స్ అధిక మోతాదులో ఉంటాయి. అందులో కాస్త తేనె, నారింజ రసం కలుపుకుని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
2. అన్నం తెల్లగా, మల్లెపువ్వుల్లా ఉండాలంటే.. ఉడికించేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండితే చాలు. తిన్న అన్నం త్వరగా జీర్ణం కావాలంటే.. ముందుగా బియ్యాన్ని వేయించుకోవాలి. ఆ తరువాత ఉడికించుకోవాలి.
3. గుడ్లు ఉడికించేటప్పుడు పగలకుండా ఉండాలంటే.. వాటికి నిమ్మరసం రాయాలి. ఫ్రిజ్ లేని ఇంట్లో గుడ్లు నిల్వచేయాలంటే.. వాటిపై ఆముదం నూనె రాసుకుంటే పాడవకుండా ఉంటాయి.
4. పూరీలు మృదువుగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు నీళ్లు వాడకుండా పాలు వాడండి ఫలితం ఉంటుంది. చపాతీ పిండీ, ఉడికించిన కోడిగుడ్లు, బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచుకుంటే.. మూడు రోజులపాటు తాజాగా ఉంటాయి.
5. నీళ్ళల్లో మునిగి ఉండేలా నిల్వచేస్తే 10 నుండి 15 రోజుల పాటు కోడిగుడ్లు తాజాగా ఉంటాయ. ఒకసారి నీళ్ళలో ముంచాక బయటకు తీసి విడిగా ఉంచితే మాత్రం త్వరగా చెడిపోతాయి.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM