సీఎం కేసీఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

byసూర్య | Wed, Apr 01, 2020, 10:51 AM

సీఎం కేసీఆర్ కి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. కరోనా వల్ల ఆరుగురు చనిపోవడం కలవరపెట్టింది. కరోనా మహమ్మరిని కట్టడి చేసేందుకు మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మీరు తీసుకుంటున్న కొన్ని విషయాలు ప్రజాబిష్టం మేరకు లేకున్నా ఇది సరైన సమయం కాదని ఎత్తిచూపడం లేదని లేఖలో పేర్కొన్నారు. మీ నిర్ణయాలను మీ ప్రభుత్వమే తుంగలో తొక్కి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతుంది అందుకే మీ దృష్టికి తీసుకొస్తున్నా.. ఒక పక్క సామాజిక దూరం పాటించమని మీరే చెబుతూ.. మరోపక్క ఫార్మాసిటీ భూసేకరణకు నోటీస్ లు ఇచ్చారన్నారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లి నానక్ రాం గూడ గ్రామ పరిధిలో రెవెన్యూ అధికారులు నోటీస్ లు ఇచ్చారు. ఏప్రిల్ 3 న ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించబోతున్నట్లు నోటీస్ లో పేర్కొన్నారు. అధికారికంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించి 3న సభ నిర్వహించడం మతిలేని నిర్ణయం అని విమర్శించారు. సభ సమావేశాలు నిర్వహిస్తే ప్రజలు గుంపుగా ఒక దగ్గరకు చేరే ప్రమాదం ఉంది. భూ సేకరణ సభ పై ప్రజల్లో ఆందోళన ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి పంపింగ్ కోసం టెండర్లు పిలిచారు. లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా కాంట్రాక్టు సంస్థలు తమ సిబ్బందికి సెలవులు ప్రకటించిందని లేఖలో తెలిపారు


Latest News
 

సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత Fri, Mar 29, 2024, 08:37 PM
మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం Fri, Mar 29, 2024, 08:36 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Fri, Mar 29, 2024, 08:34 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Fri, Mar 29, 2024, 08:33 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:32 PM