ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించండి

byసూర్య | Wed, Apr 01, 2020, 10:44 AM

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ రాంనర్సింహా గౌడ్ మంగళవారం వీఎం గ్రౌండ్ లోకి మార్చిన కొత్తపేట రైతు బజార్ మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి కొనుగోలుదారుడు శానిటైజర్ తో చేతులను పరిశుభ్రం చేసుకున్న తర్వాతనే మార్కెట్ లోకి వెళ్లాలని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలన్నారు. ఒక్కొక్కరికి మధ్య కనీసం 5 ఫీట్ల దూరం పాటించి, క్రమపద్ధతిలో కొనుగోలు చేయాలని తెలిపారు. వినియోగదారులు దయచేసి సిబ్బందికి సహకరించగలరని తెలిపారు. మార్కెట్ లోని కూరగాయల ధరల పట్టిక ఆధారంగా డబ్బులు చెల్లించగలరని కోరారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఇట్టి రైతు బజార్ పరిసరాల్లో ఏ.టీ.ఏం. కౌంటర్ ప్రారంభించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM