ఈఎంఐలపై కస్టమర్లకు బ్యాంకుల గుడ్ న్యూస్....

byసూర్య | Wed, Apr 01, 2020, 09:29 AM

ఈఎంఐ చెల్లింపుదారులకు పెద్ద ఊరట లభించింది. ఈఎంఐలపై ఆర్బీఐ సూచనకు కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆమోదం తెలిపాయి. కోవిడ్- 19ను నియంత్రించడానికి ప్రధాని మోదీ ఏప్రిల్ 15 వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్ధికంగా వెసులుబాటు కల్పించడానికి ఆర్బీఐ ఈఎంఐలపై మూడు నెలలపాటు మారటోరియం విధించింది. ఈఎంఐలపై అంతిమ నిర్ణయాన్ని ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఈఎంఐలు మూడునెలల వరకు చెల్లించనవసరం లేదని పేర్కొన్నాయి. మార్చి 1 నుండి మే 31 వరకు మారటోరియం విధిస్తున్నట్లు పేర్కొన్నాయి.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM