కొవిడ్‌-19 బాధితుల కోసం రైలులో ప్రత్యేక క్యాబిన్లు

byసూర్య | Wed, Apr 01, 2020, 07:49 AM

కొవిడ్‌-19 బాధితుల కోసం దక్షిణ మధ్య రైల్వే రెండు ఏసీయేతర బోగీలను పర్యవేక్షణ గది (క్వారంటైన్‌) లేదా ఐసొలేషన్‌ క్యాబిన్లుగా ఆధునీకరించింది. రైల్వేబోర్డు ఆదేశాల ప్రకారం దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా సూచనలతో లాలాగూడ వర్క్‌షాపులో కోచ్‌నంబర్‌ ఎన్సీ జీఎస్‌సీఎన్‌ 00205కు చెందిన రెం డింటిని ప్రొటోటైప్‌ ఐసొలేషన్‌ క్యాబిన్లుగా మార్చారు. స్లీపర్‌క్లాస్‌లో తొమ్మి ది క్యాబిన్లుండగా అందులో రెండు క్యాబిన్లను తయారుచేశారు.


ఇందుకోసం కింద, పైన ఉన్న బెర్తులతోపాటు పక్క బెర్తులను తొలిగించారు. రెండుక్యాబిన్లలో ఒకదానిలో హాఫ్‌ పార్టిషన్‌ షీట్‌, హాఫ్‌కర్టెన్‌, మరోదానిలో రెండు పూర్తిప్లాస్టిక్‌ కర్టెన్లు ఏర్పాటుచేశారు. వెంటిలేషన్‌ షట్టర్లకు దోమలు రాకుండా మెష్‌ బిగించారు. రెండు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాటిల్‌ హోల్డర్లు పెట్టారు. టాయిలెట్లలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. మరిన్ని ఏసీయేతర స్లీపర్‌ కోచ్‌లను ఐసొలేషన్‌ కోసం వినియోగించనున్నట్లు ఎస్సీఆర్‌ మంగళవారం తెలిపింది.


 


 


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM