తెలంగాణ లో "సేఫ్ హాండ్స్" ఛాలెంజ్..

byసూర్య | Tue, Mar 31, 2020, 04:06 PM

కరోనా వైరస్ వ్యాపించకుండా పాటించాల్సిన జాగ్రత్త చర్యల్లో భాగంగా  చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనిపై ప్రజలను చైతన్య పరుస్తున్న ‘సేఫ్ హ్యాండ్స్’ ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు విసిరిన ఈ ఛాలెంజ్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ నెరవేర్చారు.


కరీంనగర్ లోని తన నివాసంలో చేతులను శుభ్రం చేసుకున్న ఆయన, ప్రతి ఒక్కరూ  శుభ్రతను పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనా వైరస్ దరిచేరదని అన్నారు. అనంతరం, ఎంపీ వెంటేశ్ నేత, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, బాల్క సుమన్, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతలకు సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ విసిరారు. 


Latest News
 

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన Mon, Apr 15, 2024, 10:50 PM
ఆలయంలో అఖండ భజన కార్యక్రమం Mon, Apr 15, 2024, 10:13 PM
అగ్ని ప్రమాదంలో ఆరు ఎకరాల తోట దగ్ధం Mon, Apr 15, 2024, 10:11 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్యవైశ్య బచ్చు రామకృష్ణ Mon, Apr 15, 2024, 10:10 PM
అచ్చంపేట పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే Mon, Apr 15, 2024, 10:07 PM