బరువు తగ్గాలంటే ఇవి తినాల్సిందే..

byసూర్య | Tue, Mar 31, 2020, 02:23 PM

ఆరోగ్యంగా ఉండడం, అనారోగ్యానికి గురి కావడం ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటాయి. మనం ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటామో అంత హెల్దీగా తయారవుతాం. అందుకే కచ్చితంగా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. కానీ, చాలా మందికి అసలు ఏ ఫుడ్ ఆరోగ్యమో తెలీదు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ని తీసుకోండి. దీంతో గుండె సంబంధిత సమస్యలు, ఊబకాయం వంటివి మీ దరిచేరవు.. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో విస్తృతంగా లభించే తక్కువ క్యాలరీ కూరగాయలలో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ బరువు తగ్గటానికి సూపర్‌గా పనిచేస్తుంది. క్యారెట్ తో సూప్, హల్వాస్, బర్ఫిస్ మొదలైన వాటికి ఉపయోగించవచ్చు. దీనిని పచ్చిగా కూడా తినచ్చు. లేదా సలాడ్స్‌లో కూడా వాడొచ్చు. ఇది 100 గ్రాములకి కేవలం 41 కేలరీలను కలిగి ఉంటుంది. ఇది చాలా తక్కువ కొవ్వులు, కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. ఇందులో మంచి మొత్తంలో విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ ఉన్నాయి. కీర దోసకాయలో ఎక్కువగా శాతం నీరు ఉంటుంది. మీ ఆహారంలో చేర్చడానికి ఉత్తమమైన తక్కువ కేలరీల కూరగాయలలో ఇది కూడా ఒకటి. 100 గ్రాముల కీర దోస 15 కేలరీలను కలిగి ఉంటుంది. దీన్ని సలాడ్లు లేదా శాండ్‌విచ్‌ల రూపంలో మీ ఆహారంలో సులభంగా వినియోగించవచ్చు. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం కలిగి ఉంటుంది. తక్కువ కేలరీల ఆహారంలో తినగలిగే మరో వస్తువే కాలీఫ్లవర్. ఇది కెటోజెనిక్ డైట్ వంటి తక్కువ కార్బ్ డైట్లలో ప్రాచుర్యం పొందింది. 100 గ్రాముల కాలీఫ్లవర్ లో కేవలం 25 కేలరీలు ఉంటాయి. దీనిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి ఉన్నాయి. క్యాబేజీ లో కాలీఫ్లవర్ మాదిరిగానే కేలరీలు ఉంటాయి. కాలీఫ్లవర్ తో పోలిస్తే క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాబేజీని సూప్‌లు, మరియు శాండ్‌ విచ్‌ మరియు సలాడ్‌ లలో కూడా ఉపయోగించుకోవచ్చు. అత్యంత పోషకమైన ఆకుకూరలలో పాలకూర ఒకటి. 100 గ్రాముల పాలకూరలో కేవలం 23 కేలరీలు కలిగి ఉంటుంది. దీనిని సలాడ్‌లు, సూప్స్, పాస్తా, స్మూతీలుగా ఉపయోగించవచ్చు. ఇందులో ప్రోటీన్, ఐరన్, అలాగే ముఖ్యమైన బి విటమిన్లు కూడా ఉన్నాయి. అనపకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలో అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది 100 గ్రాములకి కేవలం 15 కేలరీలు ఉంటాయి. ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ లేదు, అలాగే అతితక్కువ సోడియం కంటెంట్ కలిగి ఉంటుంది. సాంకేతికంగా పుట్టగొడుగులు ఒక ఫంగస్ అయినప్పటికీ, వాటిని కూరగాయల పద్ధతిలో వండుతారు. ఇవి చాలా పోషకమైనవిగా భావిస్తారు. 100 గ్రాముల పుట్టగొడుగులలో కేవలం 22 కేలరీలు ఉంటాయి. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది గుండెను రక్షించే ఖనిజంగా పనిచేస్తుంది. పుట్టగొడుగులలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ నేత దుర్మరణం Thu, Apr 18, 2024, 01:00 PM
విద్యార్థిని చితక బాదిన ఉపాద్యాయుడు Thu, Apr 18, 2024, 01:00 PM
నేడు బీ-ఫామ్‌ అందుకోనున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు Thu, Apr 18, 2024, 12:33 PM
నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు Thu, Apr 18, 2024, 12:12 PM
ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM