ఏ రాష్ట్రంలో కోతలు విధించడం లేదు: జీవన్‌రెడ్డి

byసూర్య | Tue, Mar 31, 2020, 02:10 PM

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో జీతాల కోతపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీతాల కోత నుంచి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను మినహాయించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఏ రాష్ట్రంలో కోతలు విధించడం లేదని అన్నారు. కోతలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించిందా? అని ఆయన ప్రశ్నించారు. పెన్షన్ డబ్బులతో బతికేవాళ్ళనూ ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. కోతల నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ పునరాలోచించాలని జీవన్‌రెడ్డి సూచించారు


Latest News
 

పూజలు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రఘువీర్ Wed, Apr 24, 2024, 11:42 AM
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించిన కేసీఆర్ Wed, Apr 24, 2024, 11:40 AM
చిన్నంగుల గడ్డ తండాలో జడ్చర్ల ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 11:39 AM
వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM