కనుమరుగు కానున్న ఆంధ్రా బ్యాంక్ ..

byసూర్య | Tue, Mar 31, 2020, 01:54 PM

తెలుగువాళ్లకు సుపరిచితంగా ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఇక కనుమరుగు కానుంది. స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో 1923లో స్థాపించిన ఆంధ్రా బ్యాంకు దేశ విదేశాల్లో విస్తరించింది. ఇప్పుడు కేంద్రం బ్యాంకుల విలీన ప్రక్రియను చేపట్టడంతో ఈ బ్యాంకు యూనియన్‌ బ్యాంకులో విలీనం కాబోతోంది. ఆంధ్రాబ్యాంకుతో పాటు కార్పొరేషన్‌ బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్‌లో విలీనం అవుతోంది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-OBC, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI, కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనం కానున్న సంగతి తెలిసిందే. దీంతో 2017లో 27 గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 12 కు తగ్గిపోతుంది. విలీనం వల్ల కస్టమర్లకు మెరుగైన సేవలు అందడంతో పాటు ఆర్థిక వ్యవస్థకూ మంచిదని కేంద్రం పేర్కొంటోంది. ఇలా బ్యాంకుల విలీనం చేయడం వల్ల బ్యాంకుల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని చెబుతోంది.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM