ఉద్యోగుల వేతనాల్లో కోత ఎవరికి ఎంత?

byసూర్య | Tue, Mar 31, 2020, 11:51 AM

తెలంగాణలో సోమవారం ఒక్కరోజే 13 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. వారందరికి కూడా కరోనా నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి పంపించారు. గతంలో పేషంట్ 1 డిశ్చార్జ్ అయ్యాడు. తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడిన వారు త్వరగా కోలుకోవడంతో అందరిలో దైర్యం వస్తుంది. కరోనాను జయించవచ్చన్న భావన అందరిలో ఏర్పడింది. తెలంగాణలో మొత్తం 77 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక రంగం కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, కోత విధింపులు మార్చి నుంచే ప్రారంభం అవుతాయని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం వేతనం ( గ్రాస్ సాలరీ)పై కోత విధించనున్నట్లు పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేతనాల కోత అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.


Latest News
 

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన Fri, Apr 19, 2024, 11:14 AM
చలివేంద్రాన్ని ప్రారంభించిన నాయకులు Fri, Apr 19, 2024, 11:13 AM
ఆ భూమి మొత్తం అటవీ శాఖదే Fri, Apr 19, 2024, 10:55 AM
సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM