పెరిగిన చికెన్,మటన్ ధరలు... !

byసూర్య | Tue, Mar 31, 2020, 11:13 AM

కరోనా ప్రభావంతో నిన్న మొన్నటి వరకు చికెన్,మటన్,చేపల ధరలు అమాంతం తగ్గిపోయాయి. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ చికెన్,మటన్,గుడ్లు తినడం వల్ల కరోనా రాదని స్వయంగా ప్రకటించారు. అంతే కాకుండా ఇవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. దీంతో మార్కెట్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. 20 రోజుల నుంచి కిలో రూ.30,40కి అమ్ముడుపోయినా చికెన్ అమాంతం 200 రూపాయలను దాటేసింది. దీంతో మాంసపు ప్రియులు ఒక్కసారిగి షాక్ కు గురయ్యారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో మాంసపు దుకాణదారులు అమాంతం ధరలను పెంచారు. హైదరాబాద్ లో ఆదివారం కిలో చికెన్ ధర రూ.240కి చేరింది. మరి కొన్ని చోట్ల రూ.200 నుంచి 220 మధ్య అమ్మారు. హైదరాబాద్ లో కిలో మటన్ రూ. 600 నుంచి 700 మధ్య ఉండేది. ఆదివారం ఏకంగా రూ.800కి అమ్మారు. అదే విధంగా రవ్వలు,బొచ్చల చేపల ధర కిలో రూ.110 నుంచి 120 ఉండేది. దానిని ఏకంగా రూ.180 నుంచి రూ.200 వరకు పెంచారు. జిల్లా కేంద్రాలు,పట్టణ కేంద్రాలలో కూడా దాదాపు ఇవే ధరలకు చికెన్,మటన్,చేపల అమ్మకాలు జరిగాయి. ఏపీలో కూడా ఇదే విధంగా అమ్మకాలు జరిగాయి. దీంతో మాంసపు ప్రియులు ఆశ్చర్యపోయారు. కానీ అంతా ఇంట్లోనే ఉండడంతో రేటు పెరిగినా తప్పకుండా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కావడంతో కొనుగోలు చేశారు. విజయవాడ, అన్ని జిల్లా,పట్టణ కేంద్రాల్లో ఇదే విధంగా అమ్మకాలు జరిగాయి.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM