బంగారం కొనేవారికి ఇది శుభవార్తే..

byసూర్య | Tue, Mar 31, 2020, 10:42 AM

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర రెండు రోజులుగా తగ్గుతూనే వస్తోంది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది శుభవార్త అనే చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడంతో మన దేశంలోనూ దాని ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరతో పాటుగా వెండి ధర కూడా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ.41,020కు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.420 తగ్గి రూ.43,300కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.10 తగ్గుదలతో రూ.39,500కు చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.215 తగ్గుదలతో రూ.43,170కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గుదలతో రూ.39,520కు చేరింది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర కేవలం రూ.10 తగ్గింది. దీంతో వెండి ధర రూ.39,500కు చేరింది.


Latest News
 

నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు Thu, Apr 18, 2024, 12:12 PM
ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM
నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, Apr 18, 2024, 10:38 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 18, 2024, 10:24 AM
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి Thu, Apr 18, 2024, 10:23 AM