సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

byసూర్య | Tue, Mar 31, 2020, 09:03 AM

కరోనా ప్రభావంతో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జీతాల్లో భారీగా కోత విధిస్తున్నట్లు తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన తర్వాత వివిధ రకాల వేతనాల చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించనున్నారు. ఇక ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అధికారులకు జీతాల్లో 60 శాతం కోత విధిస్తారు. మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతంతో పాటు నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు. ఇదిలావుంటే పెన్షన్ దారుల విషయంలో 50 శాతం కోతతో పాటు నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లో 10 శాతం కోత విధించనున్నారు.


Latest News
 

కొందరు నాయకుల చేరికలపై అసంతృప్తి Tue, Apr 16, 2024, 05:40 PM
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు Tue, Apr 16, 2024, 05:38 PM
పెండింగ్ కూలీ డబ్బులు చెల్లించాలి Tue, Apr 16, 2024, 05:35 PM
టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు Tue, Apr 16, 2024, 05:33 PM
ఈనెల 19న వంశీచంద్ రెడ్డి నామినేషన్: ఎమ్మెల్యే వాకిటి Tue, Apr 16, 2024, 05:31 PM