మద్యం పై ప్రభుత్వం కీలక నిర్ణయం

byసూర్య | Tue, Mar 31, 2020, 09:01 AM

లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులను మూసివేశారు. మందుకు వ్యసనమైన వారు తాగడానికి మందు లేక అల్లాడిపోతున్నారు. మద్యం షాపులను తెరుస్తున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతుండటంతో మందుబాబులు వైన్స్ షాపుల ముందు ఉదయాన్నే వేచి ఉంటున్నారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సోమవారం తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు మద్యం షాపులను ఎట్టి పరిస్థితుల్లో తెరిచే ప్రసక్తే లేదని లేదని ఆయన స్పష్టం చేశారు. అక్రమంగా మద్యం అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. మద్యం వ్యసనంగా ఉన్న వ్యక్తుల కుటుంబాలను గుర్తించి ఆ వ్యక్తులను ఎక్కువగా యోగా, ఆసనాలు, వ్యాయామం, ఆధ్యాత్మిక చింతన, కుటుంబ సభ్యులతో గడపటం లాంటి వైపు వారిని మళ్లీంచేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక అధికంగా మద్యానికి బానిసలై ఆందోళనకు గురవుతున్న వారిని ఎక్సైజ్ సిబ్బంది స్థానిక డీ అడిక్షెన్ సెంటర్లలో చేర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే వారికి దగ్గర్లో ఉన్న పీహెచ్ సీ సెంటర్లకు చికిత్స కోసం అధికారులు తీసుకెళ్లాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో కూడా మద్యం షాపులు తెరిచే ప్రస్తక్తే లేదని ఓ అధికారి తెలిపారు. ఏపీలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తుంది కాబట్టి అక్రమంగా మద్యం అమ్మే అవకాశమే లేదని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసమే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయని,ప్రజలు అర్ధం చేసుకొని ప్రభుత్వాలకు సహకరించాలని ఆయన కోరారు. లాక్ డౌన్ ఉన్నంత వరకు వైన్స్ షాపులు తెరిచే ప్రసక్తే లేదని ఇరు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు.


Latest News
 

నేడు పత్తి కొనుగోళ్లు బంద్ Fri, Mar 29, 2024, 11:10 AM
నర్సాపూర్ నాయకులను కలిసిన నీలం మధు Fri, Mar 29, 2024, 11:00 AM
పార్టీ శ్రేణులతో భేష్ అనిపించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి Fri, Mar 29, 2024, 10:56 AM
సీఎం రేవంత్ తో కేశవరావు భేటీ Fri, Mar 29, 2024, 10:47 AM
యాదాద్రి శ్రీవారిని దర్శించుకున్న ఐజిపి Fri, Mar 29, 2024, 10:32 AM