ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు

byసూర్య | Tue, Mar 31, 2020, 08:41 AM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు బ్యాంకు షాకిచ్చింది. లాకర్ ఛార్జీలను భారీగా పెంచేసింది. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ బ్యాంకుల్లోని స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ల ఛార్జీలను పెంచింది ఎస్‌బీఐ. అన్ని కేటగిరీల్లో రూ.500 నుంచి రూ.3000 వరకు లాకర్ ఛార్జీలను పెంచింది ఎస్‌బీఐ. ఇకపై లాకర్ కావాలంటే మెట్రో, అర్బన్‌లో కనీసం రూ.2,000, సెమీ అర్బన్, రూరల్‌లో కనీసం రూ.1,500 చెల్లించాలి. ఒకవేళ పెద్ద లాకర్ కావాలంటే రూ.12,000 వరకు చెల్లించాల్సిందే. వన్‌ టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.500+జీఎస్‌టీ వసూలు చేయనుంది ఎస్‌బీఐ. ఒకవేళ లాకర్ రెంట్ ఛార్జీలు గడువు లోగా చెల్లించకపోతే అదనంగా 40% పెనాల్టీ చెల్లించాలి. కొత్త ఛార్జీలు 2020 మార్చి 31 నుంచి అమలులోకి వస్తాయని ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. మెట్రో, అర్బన్‌లో స్మాల్ లాకర్‌కు గతంలో రూ.1,500 ఉంటే ఇకపై రూ.2,000 చెల్లించాలి. మీడియం లాకర్ ఛార్జీలు రూ.3,000 నుంచి రూ.4,000 చేసింది బ్యాంకు. లార్జ్ లాకర్‌కు రూ.6,000 ఉంటే మార్చి 31వ తేది నుంచి రూ.8,000 చెల్లించాలి. ఇక ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్‌పై రూ.3,000 ఛార్జీలు పెరిగాయి. ప్రస్తుతం రూ.9,000 ఉంటే కొత్త ఛార్జీల ప్రకారం రూ.12,000 చెల్లించాలి.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM