వలస కూలీల ఆకలి తీర్చిన మంత్రి సత్యవతిరాథోడ్

byసూర్య | Mon, Mar 30, 2020, 05:07 PM

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీల గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్ ఆకలి తీర్చింది. సోమవారం మహబూబాబాద్ లో వలస కూలీల దగ్గరకు వెళ్లి వారికి వలస కూలీలకు తమ వంతుగా బియ్యం, సబ్బులు, నూనె, ఉప్పు, పప్పులను అందించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా చేసిన లాక్ డౌన్ లో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునందుకుని వలస కూలీలకు వసతుల్లో ఎలాంటి లోటు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి సత్యవతి చొరవతో వలస కూలీలను ఆదుకునేందుకు మహబూబాబాద్ ప్రైవేట్ పాఠశాలల సంఘం ముందుకొచ్చింది.

రాష్ట్రంలో పేద ప్రజల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్పగా ప్రైవేటు స్కూళ్ల సంఘం ప్రతినిధులు కొనియాడారు. అదేవిధంగా వలస కూలీల పట్ల మంత్రి సత్యవతి చూపుతున్న ఔదార్యం, శ్రద్ధ మాకు స్పూర్తినిచ్చిందన్నారు. అందుకే తమ వంతుగా ఈ ప్రభుత్వ ఆశయంలో భాగం కావాలనే ఉద్దేశ్యంతో నేడు ఈ చిన్న సాయం చేస్తున్నామని సంఘం ఉపాధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎండీ ఖలీద్ పాషా, సభ్యులు ఆదినారాయణ, పరమాత్మాచారి, మల్లారెడ్డి, భూపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, డాంగయ్య, చంద్రదేవ్, సురేష్, సాబిర్, మహేంద్ర భూపతి తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM