కొబ్బరితో ఎంతో ఆరోగ్యం?

byసూర్య | Mon, Mar 30, 2020, 01:28 PM

కొబ్బరిని తినడానికి చాలామంది ఇష్టపడరు. కొబ్బరిని వంటల్లో వాడితే కొంతమంది అస్సలు ఒప్పుకోరు. పచ్చికొబ్బరి తినాలన్నా, ఎండుకొబ్బరి తినాలన్నా కొంతమంది ముఖం చాటేస్తుంటారు. అయితే అలాంటి కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనం తెలిస్తే అస్సలు వదలరు అంటున్నారు వైద్య నిపుణులు. కొబ్బరి నీళ్ళలో ఎన్నో ఎనర్జీ డ్రింకులు కంటే అత్యధిక పొటాషియం, క్లోరైడు, చక్కెర, ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. చిన్నపిల్లలకు, గర్భవతులకు అనారోగ్యులకు, పాలిచ్చే తల్లులకు అనేక పోషకాల్ని కొబ్బరి నీరు అందిస్తుంది. లేత కొబ్బరి రుచికి, పోషకాలకు పెట్టింది పేరు. అనేక రకాల వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్, ప్రోటోజోల్ రుగ్మతల నుంచి కాపాడగల గుణం కలిగి ఉంది. ట్రీ ఆఫ్ లైఫ్ గాను స్వర్గపు చెట్టుగా పిలువబడే ఈ చెట్టు ప్రతి భాగము ఉపయోగపడుతుంది. కొబ్బరినూనె చర్మరోగాలను నయం చేయడంలోనూ, జట్టు పోషణకు వంటల్లోను ఔషధాలలోను వాడుతున్నారు. సబ్బుల తయారీల్లో కూడా వాడుతున్నారు.


Latest News
 

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM