కొండెక్కిన చికెన్,మటన్ ధరలు

byసూర్య | Mon, Mar 30, 2020, 10:59 AM

కరోనా ప్రభావంతో నిన్న మొన్నటి వరకు చికెన్,మటన్,చేపల ధరలు అమాంతం తగ్గిపోయాయి. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ చికెన్,మటన్,గుడ్లు తినడం వల్ల కరోనా రాదని స్వయంగా ప్రకటించారు. అంతే కాకుండా ఇవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. దీంతో మార్కెట్ లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. 20 రోజుల నుంచి కిలో రూ.30,40కి అమ్ముడుపోయినా చికెన్ అమాంతం 200 రూపాయలను దాటేసింది. దీంతో మాంసపు ప్రియులు ఒక్కసారిగి షాక్ కు గురయ్యారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో మాంసపు దుకాణదారులు అమాంతం ధరలను పెంచారు. హైదరాబాద్ లో ఆదివారం కిలో చికెన్ ధర రూ.240కి చేరింది. మరి కొన్ని చోట్ల రూ.200 నుంచి 220 మధ్య అమ్మారు. హైదరాబాద్ లో కిలో మటన్ రూ. 600 నుంచి 700 మధ్య ఉండేది. ఆదివారం ఏకంగా రూ.800కి అమ్మారు. అదే విధంగా రవ్వలు,బొచ్చల చేపల ధర కిలో రూ.110 నుంచి 120 ఉండేది. దానిని ఏకంగా రూ.180 నుంచి రూ.200 వరకు పెంచారు. జిల్లా కేంద్రాలు,పట్టణ కేంద్రాలలో కూడా దాదాపు ఇవే ధరలకు చికెన్,మటన్,చేపల అమ్మకాలు జరిగాయి. ఏపీలో కూడా ఇదే విధంగా అమ్మకాలు జరిగాయి. దీంతో మాంసపు ప్రియులు ఆశ్చర్యపోయారు. కానీ అంతా ఇంట్లోనే ఉండడంతో రేటు పెరిగినా తప్పకుండా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కావడంతో కొనుగోలు చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM