సులభంగా పంటకు ఎరువు వేసే పరికరం...

byసూర్య | Mon, Mar 30, 2020, 10:56 AM

రైతే దేశానికి వెన్నెముక అని ఒక నానుడి. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్ అనే నినాదం కూడా ఇచ్చారు. భారతదేశం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత దేశం. కానీ దేశంలో రైతులు వివిధ కారణాల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందులో నకిలీ ఎరువులు కూడా ఒకటి. పత్తి రైతులు కూడా ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వారికోసం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకు చెందిన సత్యనారాయణరెడ్డి రసాయనిక ఎరువు వేసే పరికరాన్ని తయారుచేసారు. దాని వలన చాలా ఉపయోగాలున్నాయి. పత్తి వయసును బట్టి ఎరువుల మోతాదు సర్దుబాటుతో ఉపయోగించవచ్చు. కూలీల సంఖ్యను 50% వరకు తగ్గించుకోవచ్చు. నడుమునొప్పి లేకుండా సునాయాసంగా ఎరువులు వేసుకోవచ్చు. పైగా ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న పరికరం. సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పంట ఏపుగా ఎదిగిన దశలో ఇది దోహదపడుతుంది.


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM