క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై కేసు

byసూర్య | Sun, Mar 29, 2020, 01:47 PM

ఈ నెల 14న సౌదీ దేశం నుంచి హైదరాబాద్​ వచ్చిన ఒమర్ ఖాన్​కు 28 రోజులు హోమ్ క్వారంటైన్​లో ఉండాలని వైద్యులు సూచించారు. దీనికి సంకేతంగా చేతిపై స్టాంప్ వేశారు. దీన్ని లెక్కచేయకుండా అతను రోజు బయట తిరుగుతున్నాడు. దీనిపై బండ్లగూడ యూపీహెచ్​సీ మెడికల్ ఆఫీసర్ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాకబు చేయగా ఒమర్ బయట తిరుగుతున్నట్లు తెలిసింది. అతనికి నచ్చజెప్పి అంబులెన్స్ ద్వారా ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులను కూడా 14 రోజుల పాటు బయటకు రావద్దని వైద్యులు సూచించారు. ఒమర్ ఖాన్​పై కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.


Latest News
 

పలు శుభకార్యాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం Thu, Mar 28, 2024, 03:11 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM